ఆయన తప్పు చేయడు.. భర్త అరెస్ట్ పై శ్యామల రియాక్షన్!
on Apr 28, 2021
ఓ మహిళను మోసం చేసిన ఛీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద కోటి రూపాయలు తీసుకొని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంపై యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడారు. తన భర్త తప్పు చేయడని.. ఇది తప్పుడు కేసు అని చెప్పారు. తనకు కూడా అరెస్ట్ విషయం మీడియా ద్వారానే తెలిసిందని.. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని మాత్రం కచ్చితంగా చెప్పగలనని వెల్లడించారు. కోటి రూపాయల కోసం ఓ ఆడపిల్లను మోసం చేయాల్సిన అవసరం కానీ.. అలాంటి వ్యక్తిత్వం కానీ తన భర్తది కాదని నమ్మకంగా చెప్పారు.
తన పదేళ్ల సంసార జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని.. తన భర్త డబ్బుల కోసం అమ్మాయిలతో ఆడుకునే మనిషి కాదని అన్నారు. త్వరలోనే నిజం అందరికీ తెలుస్తుందని.. అప్పటివరకు తప్పుడు ఆరోపణలపై న్యూస్ ప్రసారం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఒక అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి నిజానిజాలు విచారించకుండా... అరెస్ట్ చేస్తారనే నాలెడ్జ్ తనకు ఉందని.. కానీ నిజమేంటో అందరికీ త్వరలోనే తెలుస్తుందని అన్నారు. తనకు కొంచెం సమయం ఇస్తే జరిగిన విషయాల గురించి తెలుసుకుంటానని.. పోలీసుల వైపు నుండి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు.
ఏదేమైనా.. తను మాత్రం తన భర్త వైపున నిలబడతానని స్పష్టం చేశారు. ఓ మహిళతో నరసింహకు చాలా కాలంగా సంబంధం ఉందని.. గొడవలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని.. తనకు ఈ ఇష్యూ గురించి ఇప్పటివరకు తెలియదని వెల్లడించారు. అయితే ఇది తప్పుడు కేసు కాబట్టి పెద్దగా వర్రీ అవ్వడం లేదని.. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు తెలియజేస్తానని తెలిపారు.
Also Read